చిరంజీవిని జైల్లో పెట్టారు!
on Jun 29, 2016
"ఏమిటీ ఎక్స్ మినిస్టర్, ప్రెజంట్ రాజ్యసభ మెంబర్, మన మెగాస్టార్ ను "జైల్లో" పెట్టారా?" అని అడిగితే "నిజమే జైల్లో పెట్టారు" అనే సమాధానం వినిపిస్తోంది. అయితే.. అందరూ అనుకొంటున్నట్లుగా క్రిమినల్ ఇష్యూ కారణంగా మాత్రం కాదు, సినిమా షూటింగ్ కోసం. చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తాజా చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఒకటి ప్రజల కోసం కష్టపడే శ్రామికుడి పాత్ర కాగా.. మరొకటి దొంగోడి క్యారెక్టర్. ప్రస్తుతం ఆ రెండో క్యారెక్టర్ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో చిరంజీవి "ఖైదీ నెం.150"గా కనిపించనున్నాడు. ఆ ఖైదీ లుక్ ను చిరును చూసినవారందరికీ.. "ఖైదీ నెం.786" గుర్తొచ్చింది అంటే అతిశయోక్తి కాదేమో.
ఇకపోతే.. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బికినీ బ్యూటీ నర్గీస్ ఫక్రీనీ దాదాపుగా ఖరారు చేసినట్లే అని వస్తున్న వార్తలతో మెగా అభిమానులు కంగారుపడుతున్నారు. నర్గీస్ అందంగానే ఉన్నప్పటికీ.. మన తెలుగు సినిమా శైలికి ఏమాత్రం సెట్ అవ్వదు. అందులోనూ రొమాన్స్ చేయాల్సింది చిరంజీవితో కాబట్టి.. హిందీ తప్ప తమిళ, మలయాళ భాషా కథానాయికలను ఎవర్ని తీసుకోవచ్చి నటింపజేసినా ఫర్వాలేదంటున్నారు!