సీనియర్ నటుడు చంద్రమౌళి మృతి...
on Apr 5, 2018
టాలీవుడ్ సీనియర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రమౌళి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. చంద్రమౌళి మృతిపై టాలీవుడ్ కు చెందిన పలువురు తమ సంతాపం తెలిపారు. కాగా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి స్వస్థలం ఏర్పేడు మండలంలోని మునగలపాలెం. 1971లో విడుదలైన ‘అంతా మన మంచికే’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు. సుమారు 200 సినిమాల్లో ఆయన నటించారు.