కరీనా కపూర్ సినిమాల్ని బాయ్‌కాట్ చెయ్యండి!
on Aug 13, 2020
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ విషాద మరణం సంభవించి రెండు నెలలు గడిచాయి. అప్పట్నుంచీ 34 ఏళ్ల ఆ యువ నటుడు ఆత్మహత్య చేసుకోడానికి ప్రేరేపించిన కారణాలేమిటనే దానిపై అనేక వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ పెద్దలే అతని కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించారనీ, అతను సూసైడ్ చేసుకోడానికి కారకులయ్యారనీ నెటిజన్లు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. ఒక నటుడి మరణానికి సంబంధించి ఇంత కాలం ఈ విధంగా వాదనలు, చర్చలు జరగడం మనం ఇదివరకెన్నడూ చూడలేదు. సుశాంత్ ఉదంతంలో కరణ్ జోహార్, అలియా భట్, మరికొందరిని తీవ్రంగా ట్రోల్ చేస్తూ వచ్చిన నెటిజన్లు తాజాగా కరీనా కపూర్ ఖాన్‌ను టార్గెట్ చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నెపోటిజంను సమర్థించుకుంటూ వచ్చిన కరీనా వారసుల్ని విజేతలుగా తయారుచేస్తోంది ప్రేక్షకులేనని వాదించింది. ఏ యాక్టర్నైనా స్టార్‌ని చేయాలన్నా, కిందకి పడేయాలన్నా ఆ శక్తి ఉంది ప్రేక్షకులకేనని చెప్పిన ఆమె, బాలీవుడ్లో నెపోటిజంపై జరుగుతున్న చర్చను భయంకరమైందిగా అభిప్రాయపడింది. అంతేకాదు.. వారసులను ద్వేషించే పనైతే వాళ్ల సినిమాలను చూడొద్దని కూడా ఆమె ఆడియెన్స్‌కు సూచించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కరీనాపై విరుచుకుపడ్డారు. ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఆమెకు తన ఫ్యాన్స్ నుంచి, ఆడియెన్స్ నుంచి సపోర్ట్ అవసరం లేదా అని ప్రశ్నించారు. ఆమె తదుపరి సినిమా 'లాల్ సింగ్ చడ్ఢా'ను బాయ్‌కాట్ చేయాల్సిందిగా పిలుపునిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ ట్వీట్స్....