English | Telugu

ఫైనల్ వరకు ఉండేదెవ‌రు?.. బిగ్ బాస్ 50రోజులు పూర్తి..

on Oct 27, 2020

 

బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీషో యాభైరోజుల జర్నీ పూర్తి చేసుకుంది. ఆరువారాలు హోస్ట్ గా కింగ్ నాగార్జున అలరించారు. ఇక ఏడోవారం వీకెండ్ దసరా స్పెషల్ గా నాగార్జున పెద్దకోడలు అక్కినేని సమంత హోస్ట్ గా వ్యవహరించి కంటెసెంట్లను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్పెషల్ అపిరెన్స్ గా వచ్చిన అక్కినేని అఖిల్ తనదైన శైలీలో ఎంటర్ టైన్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 4 లో 16మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ముగ్గురు సెలబ్రేటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో ఇద్దరు ఇంటిదారి పట్టగా కామెడియన్ ముక్కు అవినాష్ ఏడోవారం కెప్టెన్ గా హౌస్ లో కొనసాగుతున్నారు. ఎనిమిదోవారానికి హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇక రానున్న ఏడువారాల్లో వీరిలో ఇంటిదారి పట్టేవారిలో ముందుగా అమ్మ రాజశేఖర్, లాస్య, మెహబూబ్, మోనాల్, అవినాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఇక చివరి వరకు ఉండే కంటెస్టెంట్లు ఎవరు అన్నది ఇప్పటికే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అమ్మయిల్లో హారిక, అరియానా బలమైన కంటెస్టెంట్లుగా ఉన్నారు. అబ్బాయిల్లో అభిజిత్, అఖిల్, నోయల్, సోహైల్ పోటాపోటీ పడుతున్నారు. వీరిలో నోయల్ గత సీజన్ లో విన్నర్ గా నిలిచిన రాహుల్ బెస్ట్ ఫ్రెండ్. దాంతో హౌస్ లో ఎలా మెలగాలో, బిగ్ బాస్ ను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ముందుగానే తెలుసుకున్నట్లు కనిపిస్తుంది. మొదటి రెండు వారాలు తన ర్యాప్ సాంగ్స్ తో హౌస్ లో హల్ చల్ చేసినా ఆ తర్వాత సెఫ్ గేమ్ అడుతూ టాస్క్ ల్లో పెద్దగా రిస్క్ తీసుకోవడం లేదు. కామ్ గా.. ఉన్నామా.. తిన్నామా అన్నట్లు హౌస్ లో కంటిన్యూ అవుతున్నారు. అందరితో మంచిగా ఉంటూ ఇప్పటికే రెండుసార్లు హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. జైలుకు వెళ్ళిన ఏకైక కంటెస్టెంటు కూడా నోయల్ లే కావడం గమనించాల్సిన విషయం.

నోయల్ వ్యక్తిగత విషయానికి వస్తే సింగర్ గా సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత యాక్టర్ గా చాలా సినిమాలో కనిపించాడు. ఇటీవల తన తండ్రి గురించి అబద్దాలు చెప్పాడంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే నోయల్ తమ్ముడు క్లారిటీ ఇవ్వడంతో నోయల్ పై వచ్చిన వ్యతిరేకత కాస్త తగ్గింది.

ఇక అభిజిత్ మైండ్ గేమ్ ఆడుతూ నాగార్జున తోనూ కాప్లిమెంట్స్ అందుకున్నాడు.   టాస్క్ లకు దూరంగా ఉంటూ , డాన్స్ ఫర్మామెన్స్ లోనూ వెనకబడుతున్న అభి పై సమంత కూడా కామెంట్ చేసింది. కాప్లిమెంట్స్ అయినా కామెంట్స్ అయినా ఒకేలా తీసుకుంటూ చాలాచాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు అభిజిత్.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల సినీపరిశ్రమకు అభిజిత్ ను పరిచయం చేశారు. మొదటిసినిమాతోనే ఆకట్టుకున్న అభి ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడులో నటించాడు. అభిజిత్ నటించిన పెళ్ళిగోల వెబ్ సిరిస్ కుర్రకారును అలరించింది. దాంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అఖిల్ అభి ఫ్రెండ్స్ కూడా కావడం అతనికి మరో ఫ్లస్ పాయింట్. బిగ్ బాస్ సీజన్ 4లో మొదటివారం నుంచి దాదాపు ప్రతివారం నామినేషన్స్ లోకి వస్తున్నాడు. అయినా ఫాల్లోవర్స్ సేవ్ చేస్తున్నారు.

సింగరేణి ముద్దు బిడ్డ అంటూ నాగార్జునతో ముద్దుగా పిలిపించుకున్న సోహైల్ హౌస్ లో గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ గా ఉన్నాడు. కథ వేరుంటది అంటూ మొదటి 2,3వారాలు మెడనరాలు పొంగేలా ఆవేశపడిపోయిన సోహైల్ ఆ తర్వాత నాగార్జున సూచనలతో చాలా కూల్ అయిపోయాడు. అన్నీ టాస్క్ లో బెస్ట్ గా ఫర్మామ్ చేస్తున్నాడు.  బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంలో అరియానాతో కలిసి సీక్రెట్ రూంలో రెండు రోజులు ఉన్నాడు. ఆ తర్వాత హౌస్ లోకి వచ్చారు. మొదట్లో నాలుగైదు వారాల్లో బిగ్ హౌస్ నుంచి ఇంటిదారి పడతాడు అనిపించినా.. ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు.
కొత్తబంగారు లోకం సినిమాతో సోహైల్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తున్నా పెద్ద గుర్తింపు రాలేదు. ఇస్మార్ట్ సోహైల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడంతో తనను మంచి బ్రేక్ వస్తుందన్న ఆశతో టాస్క్ ల్లోనూ బెస్ట్ గా ఆడుతున్నాడు.

నేను నాలానే ఉంటా అంటూ అన్ని రకాల ఎమోషన్స్ ను బిగ్ హౌస్ లో పండిస్తున్న కంటెస్టెంట్ అఖిల్ సార్థక్. మొదటివారంలోనే కంటతడి పెట్టి సున్నిత మనష్కుడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు.  బిగ్ హౌస్ లో గంగవ్వ ప్రిమమైన మనుమడిగా  ఆప్యాయతను అందుకున్నాడు. ఆ తర్వాత మోనాల్ తో చనువుగా ఉంటూ లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్నాడు. గత రెండువారాలుగా మోనాల్ ఎలిమినేషన్ ను అఖిల్ ప్రేమ అడ్డుకుంటుంది అంటే అర్ధం చేసుకోవచ్చు అఖిల్ కు హౌస్ లో ఎంత ప్రాముఖ్యత ఉందో...బిగ్ బాస్ హౌస్ లోని అన్ని టాస్క్ లోనూ పాల్గొంటూ ఫిట్ నెస్ వీరుడిగా గుర్తింపు పొందాడు. ఇక అఖిల్ సార్థక్ వ్యక్తిగతం జీవితానికి వస్తే సీరియల్స్ లో నటిస్తున్నాడు.  హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. ఈ నలుగురిలో ముగ్గురు మాత్రం కచ్ఛితంగా ఫైనల్ వరకు ఉంటారు అన్ని ప్రేక్షకులు, నెటిజన్ల అభిప్రాయం.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంలో కంటెస్టెంట్లలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ఏడు వారాల్లో ఇంటిదారి పట్టిన వారిలో ఐదుగురు అమ్మాయిలే. గంగవ్వ తనంట తాను బిగ్ హౌస్ నుంచి బయటకు రావడంతో మొత్తం పదిమంది లేడీ కంటెస్టెంట్లలో ఆరుగురు బయటకు రాగా నలుగురు హౌస్ లో కొనసాగుతున్నారు. వీరిలో మోనాల్, లాస్య ఇంటిదారి పడతారని చివరి వరకు అరియానా, హారిక హౌస్ లో కొనసాగుతారని నెటిజన్ల అభిప్రాయం. వీరిద్దరూ కూడా తమతమ నిజజీవితాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోని బిగ్ బాస్ హౌస్ వరకు చేరుకున్నారు.

అరియానా ఫస్ట్ డే నుంచి సూపర్ యాక్టీవ్ గా ఉంటూ అన్ని టాస్క్ లో పోటాపోటీగా ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్  మూడుసీజన్లలో లేడీ కంటెస్టెంట్లు ఎవరూ విన్నర్ కాలేదు. ఈ సారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ కావాలన్న పట్టుదలతో ఆమె ఉన్నట్లు కనిపిస్తోంది.  ఏ టాస్క్ లోనూ వెనక్కి తగ్గకుండా గట్టి పోటీని ఇస్తోంది. అరియానా ఐదేళ్ల కిందట యాంకర్ గా వినోదరంగంలోని వచ్చారు. జెమిని కామెడీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆర్జెవీని ఇంటర్వ్యూ చేసి ఆయనతో మెప్పు పొందారు. ఇక అప్పటినుంచి ఆర్జీవీ మెచ్చుకున్న అరియానా అన్నగుర్తింపు వచ్చింది. దాంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. చలాకీతనం, ముక్కుసూటిగా వ్యవరించే తత్త్వం ఆమెకు బిగ్ హౌస్ లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రారంభంలో సోహైల్ తో కలిసి సీక్రెట్ రూంలో ఉంది ఇంటిసభ్యులను ఓ ఆటఆడుకుంద. హౌస్ లోకి వచ్చిన తర్వాత బెస్ట్ ఫర్మామెన్స్ ఇస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే స్పీడ్ తో జాగ్రత్తగా ఆడితే ఆమె అనుకున్న కల నిజం కావచ్చు. నాల్గోసీజన్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ కావచ్చు.. ఇది అరియానే కావచ్చు.

కామ్ గా ఉంటూనే టాస్క్ లో మాత్రం రెచ్చిపోయి ఫర్మామెన్స్ చేస్తుంది హారిక. లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్న దేత్తడి హారిక ఫైనల్ వరకు ఉండే అవకాశాలు చాలానే ఉన్నాయి. అమెజాన్ లో మంచి ఉద్యోగం వదిలేసి యూట్యూట్ ప్రారంభించి చాలాతక్కువ కాలంలోనే నెటిజన్ల హార్ట్ లకు కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో మంచిఫాలోయింగ్ ఉంది. అరియానా తన మనసులోది అరిచి చెప్పితే హారిక మాత్రం చేతల్లో చూపిస్తోంది. ఫైసల్ వరకు వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడే అవకాశాలు చాలా ఉన్నాయి.

- య‌శోద వంగా


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.