బిగ్ బాస్ 4: మోనాల్‌తో డేటింగ్ చాన్స్ కొట్టేసిందెవరు?
on Nov 25, 2020
బిగ్ బాస్ నిర్వాహకులు ఈరోజు కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. దాని ద్వారా డెవిల్ టాస్క్ ఉందని తెలిసింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా డెవిల్ టాస్క్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. కంటెస్టెంట్లు దెయ్యాన్ని చూసి తాము భయపడేది లేదని, వస్తే చూసుకుంటామని సవాళ్లు విసిరారు. డెవిల్ వాయిస్ వినిపించినప్పుడు జబర్దస్త్ అవినాష్ తనదైన శైలిలో హాస్యం చేశాడు. అయితే బ్యాగ్రౌండ్లో వినిపించిన డెవిల్ మ్యూజిక్‌తో వాళ్లు ఉలిక్కిపడ్డారు. జలజ అనే దెయ్యం వచ్చి ఇన్మేట్స్ను భయపెట్టే యత్నం చేసింది.
దెయ్యాన్ని చూసి అరియానా భయపడి, వణికిపోవడంతో డెవిల్ టాస్క్ అంత ఈజీ కాదని హౌస్‌మేట్స్‌కు అర్థమైంది. ఆ తర్వాత డెవిల్ వాయిస్ స్థానంలో బిగ్ బాస్ వాయిస్ వినిపించింది. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కొన్ని టాస్క్‌లు ఇచ్చాడు. ఆ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఆధారంగా లగ్జరీ బడ్జెట్‌ను కేటాయిస్తారు. సో.. ఈ రాత్రి ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో డెవిల్ ఎలా ఆడుకుంటుందోననేది ఆసక్తికరం.
ఒక టాస్క్ కోసం అభిజీత్, అఖిల్ మధ్య పోటీ జరగనుంది. ఆ టాస్క్‌లో ఎవరు గెలిస్తే వారికి మోనాల్‌తో డేటింగ్ చేసే చాన్స్ వస్తుంది. ఆ టాస్క్‌ను అఖిల్ గెలుచుకొని, ఆ చాన్స్ చేజిక్కించుకుంటాడు. తర్వాత సొహేల్‌తో మొదలుపెట్టి కంటెస్టెంట్లు ఏడుగురూ కలిసి హౌస్‌లో డాన్స్ చేస్తారు.
Also Read