బిగ్‌బాస్ తమిళ్ విన్నర్ ఎవరో తెలుసా..?
on Oct 1, 2017
ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా ఛానెళ్లో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో మంచి ఆదరణ పొందింది. మొదట్లో కాస్తంత నెమ్మదించినా రాను రాను టీఆర్పీలో దూసుకువెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఈ షోలో అంతిమ విజేతగా శివబాలాజీ నిలిచాడు. సరే మన తెలుగులో లానే తమిళ్లోనూ బిగ్‌బాస్ షో జరుగుతున్న విషయం తెలిసిందే..అది కూడా ఈ వారంతో చివరి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. నటుడు ఆరవ్ విన్నర్‌గా నిలిచాడు. ఉత్కంఠ భరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్లో బిగ్‌బాస్ హోస్ట్ కమల్ హాసన్ ఆరవ్‌ను విజేతగా ప్రకటించాడు. అయితే గణేశ్ వెంకట్రామన్ విజేతగా నిలుస్తాడని అంతా భావించారు..కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆరవ్ విన్నర్‌గా నిలవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అతడికి రూ.50 లక్షల నగదును..బిగ్‌బాస్ ట్రోఫిని అందజేశారు. ఫైనల్ ఎపిసోడ్‌కు స్టార్ డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్‌రాజు హాజరయ్యారు.