బిగ్ బాస్ 4: పోల్ డాన్స్ చేసిన అరియానా!
on Sep 21, 2020
హౌస్‌లోని కంటెస్టెంట్లకు నాగార్జున ఫన్నీ టాస్క్ లు ఇచ్చారు. నామినేషన్ లో ఉన్న ఏడుగురు సభ్యుల అదృష్టాన్ని బెలూన్స్ తో పరీక్షించారు. ఈ టాస్క్ లో అభిజిత్, కుమార్ సాయి సేఫ్ అయ్యారు. దాంతో అప్పటివరకు నెక్ట్స్ ఎలిమినేటర్ కుమార్ సాయి అనుకున్నవారి అంచనా తప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ రింగ్ గేమ్ టాస్క్ ఇచ్చారు.
ఇంటి సభ్యుల జంటలు ఆడిన ఈ గేమ్ లో అఖిల్ గెలవగా ఓడిపోయిన అభిజిత్ పుషప్స్ చేశాడు. గెలిచిన మోనాల్‌ను ఓడిపోయిన హారిక నోరు మూయకుండా పొగిడింది. మెహబూబ్ గెలవగా ఓడిన సోహైల్ పచ్చి ఉల్లిపాయ తిన్నాడు. నాగవల్లి దేవి గెలిస్తే ఓడిపోయిన అమ్మ రాజశేఖర్ పచ్చి మిర్చి కరకరా నమిలేశాడు. సుజాత గెలవగా, ఓడిన లాస్య చిన్నపిల్లలా మారాం చేసింది.
దివి గెలిస్తే ఓడిపోయిన అరియానా పోల్ డ్యాన్స్ చేసింది. గంగవ్వ గెలవగా, ఓడిన కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్రయత్నించాడు. అవినాష్ గెలిచి ఓడిపోయిన నోయల్‌కు లిప్‌స్టిక్ రుద్దాడు. ఈ టాస్స్ లో గంగవ్వ, కుమార్ సాయితో పోటీ పడి మరీ గెలిచింది. చాలా హుషారుగా హౌస్ లో గంగవ్వ టాస్క్ పూర్తి చేసింది. రాజశేఖర్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు.
Also Read