హారిక మనుషుల్ని వాడుకొని గేమ్ ఆడే రకం కాదు!
on Dec 3, 2020
బిగ్ బాస్ 4లో టాప్ 5లో నిలిచే హౌస్‌మేట్స్‌లో ఒకరిగా దేత్తడి హారిక వీక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇటీవల చాలా స్నేహంగా ఉంటూ వచ్చిన అభిజీత్‌ను ఎలిమినేషన్ కోసం నామినేట్ చేసి, అతడితో పాటు వీక్షకుల్నీ ఆశ్చర్యపరిచింది. అయినప్పటికీ హారికకే తన ఓటు అంటున్నాడు అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన నోయల్ షాన్. 'సామజవరగమన' షో హోస్ట్ అయిన అతను బిగ్ బాస్ హౌస్‌లోకి రి-ఎంట్రీ ఇస్తాడని చాలామంది భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు.
లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హారికను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అభిజీత్, హారికలను మెచ్చుకున్నాడు. కెప్టెన్సీకి హారిక ఎనిమిది సార్లు పోటీలో నిలవడం మామూలు విషయం కాదన్నాడు. మనుషుల్ని వాడుకొని గేమ్ గెలవాలనుకొనే రకం కాదనీ, ఎవడేమై పోయినా నాకేంటి, 50 లక్షలు గెలవడం ముఖ్యమనుకొనే మనిషి కాదనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హారికకు లవ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేవని చెప్పాడు నోయల్. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న విధంగానే, బిగ్ బాస్ హౌస్‌లోనూ పోటీతత్వంతో ఇక్కడి దాకా వచ్చిందని ఆకాశానికెత్తేశాడు. బిగ్ బాస్ విన్నర్‌గా ఇంతదాకా అమ్మాయిలు నిలవలేదనీ, ఈసారైనా హారికను గెలిపించమనీ వీక్షకులను అతను కోరాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
