అషు రెడ్డి బర్త్‌డే పార్టీ.. శిల్పా చక్రవర్తి ఎందుకు అటెండ్ కాలేదంటే...
on Sep 15, 2020
'చల్ మోహన్ రంగ' సినిమాతో పరిచయమైన నటి అషు రెడ్డి అంటే వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. డబ్స్మాషర్గానూ అషు మంచి ఫేమస్. సెప్టెంబర్ 13 ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జోష్‌గా జరుపుకుంది అషు. బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు దోస్తులైన శివజ్యోతి, రేణుక లాంటివారు ఈ సెలబ్రేషన్స్‌కు అటెండయ్యారు. టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ అయిన శివజ్యోతి అయితే అషు బుగ్గపై ముద్దు పెట్టి, ఆ వీడియో క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈ విషయంలో కొవిడ్ 19 నిబంధనలేవీ ఆ ఫ్రెండ్స్‌కు అడ్డు రాలేదు.
కాగా శివజ్యోతి పెట్టిన పోస్ట్‌కు సీనియర్ టీవీ యాంకర్, బిగ్ బాస్ 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన శిల్పా చక్రవర్తి స్పందించింది. అషు రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పిన ఆమె, "ఈ రోజు నీ పార్టీని నేను మిస్సవుతున్నా. డాడీ కోసం హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్నందున సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. మీరు ఎంజాయ్ చెయ్యండి." అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి శిల్ప తండ్రి కొవిడ్ 19 ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరారని తెలుస్తోంది.
శివజ్యోతితో పాటు టీవీలో తన కామెడీ టైమింగ్‌తో అమితంగా అలరించే రోహిణి సైతం అషు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని, ఆమె చేత కేక్ కోయించింది.