అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘BB3’...
on Jul 1, 2020
నటసింహ నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా టర్న్ అయినప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం తన సినిమాలతో పలకరిస్తూనే వచ్చారు. మరీ ముఖ్యంగా.. 1983 నుండి 2012 వరకు అంటే 30 ఏళ్ళ పాటు ప్రతీ క్యాలెండర్ ఇయర్‌లోనూ బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే, 2013 మాత్రం బాలయ్యకి 'జీరో రిలీజ్ ఇయర్'గా నిలిచిపోయింది. అలా గ్యాప్ తీసుకున్న తరువాత బాలయ్య నుంచి వచ్చిన ‘లెజెండ్’ (2014) సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.. అప్పట్లో బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా.. లాంగ్ రన్ చూసిన సినిమాగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.
‘లెజెండ్’ తరువాత మళ్ళీ ప్రతీ ఏడాది తన సినిమాలతో సందడి చేస్తూ వచ్చారు బాలయ్య. ఇలాంటి నేపథ్యంలో.. కరోనా కారణంగా నటసింహకి 2020 రూపంలో మరో 'జీరో రిలీజ్ ఇయర్' తప్పడం లేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న బాలయ్య తాజా చిత్రం (‘యన్.బి.కె.106’) 2021 వేసవిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలయ్య సోలో హీరోగా టర్న్ అయ్యాక ఫస్ట్ 'జీరో రిలీజ్ ఇయర్' (2012) తరువాత వచ్చిన ‘లెజెండ్’కి బోయపాటి శ్రీను దర్శకుడు కాగా.. సెకెండ్ 'జీరో రిలీజ్ ఇయర్' (2020) తరువాత వస్తున్న కొత్త చిత్రానికి కూడా బోయపాటినే డైరెక్టర్ కావడం విశేషం. అంతేకాదు.. ‘లెజెండ్’ తరహాలోనే బాలకృష్ణ – బోయపాటి థర్డ్ జాయింట్ వెంచర్ (‘BB3’) కూడా వేసవినే టార్గెట్ చేసుకోవడం ఆసక్తిదాయకం.
మరి.. ‘లెజెండ్’ లాగే ‘BB3’ కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ అవుతుందేమో చూడాలి.