ENGLISH | TELUGU  

బాలయ్య, పవన్ ల సంక్రాంతి ముచ్చట్లు!

on Jan 15, 2018


ఒకప్పుడు సంక్రాంతి అంటే... కోళ్ల పందాలు, యడ్ల పందాలు.  పొటేళ్ల  పందాలు, ముగ్గుల పోటీలు, భోగిమంటలు.. ఎక్సట్రా ఎక్సట్రా. అయితే... ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో సినిమా కూడా ఓ భాగమైపోయింది. స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలై తలపడటం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది.

ఈ ఏడాది సంక్రాంతి కోడి పుజులు పవన్ కల్యాణ్, బాలకృష్ణ.  2018లో ‘అజ్ఙాతవాసి’గా తొలిబోణీ పవర్ స్టార్ కొడితే... ‘జై సింహా’ అనిపించుకోడానికి నటసింహం వెనకాలే వచ్చాడు.

వీరిద్దరిలో సంక్రాంతి సెంటిమెంట్ ని బాహాటంగా ఎంజాయ్ చేసిన హీరో బాలకృష్ణ. 30 ఏళ్లలో చిరంజీవి, బాలకృష్ణ ఎనిమిది సంక్రాంతులు తలపడ్డారంటే నమ్ముతారా? వీరిలో విజయాలు కూడా ఇద్దరూ దాదాపుగా సమానంగానే అందుకున్నారు. అయితే... బాలకృష్ణ, పవన్ కల్యాన్ సంక్రాంతి రేసులో నిలవడం ఇదే ప్రథమం. ఈ సంక్రాంతి సందర్భంగా... బాలయ్యను వరించిన సంక్రాంతి విజయాల గురించీ, పవర్ స్టార్ చేసిన సంక్రాంతి సినిమాల గురించీ కాసేపు మనం ముచ్చటించుకుందాం.

బాలయ్య తొలి సంక్రాంతి హిట్ ఏంటో తెలుసా? ‘దానవీర శూరకర్ణ’. మహానటుడు ఎన్టీయార్  అన్నీ తానై చేసిన ఈ సినిమాలో బాలయ్య అభిమన్యునిగా ఓ ప్రత్యేక పాత్ర చేశాడు. ఆ విధంగా తొలి సంక్రాంతి విజయాన్ని అందుకున్నాడు. 1977లో వచ్చిందీ సినిమా.

తర్వాతి సంక్రాంతి హిట్ ‘అనురాగ దేవత’. ఇది కూడా ఎన్టీయార్ సినిమానే. ఇందులోనూ బాలయ్యది ప్రత్యేక పాత్రే. ఇది 1982 నాటి ముచ్చట.

*  బాలయ్య హీరోగా వచ్చిన తొలి సంక్రాంతి సినిమా ‘ఆత్మబలం’. 1985లో వచ్చిన ఈ సినిమా  అట్టర్ ఫ్లాప్.
* 1987 సంక్రాంతికి వచ్చిన బాలయ్య ‘భార్గవరాముడు’ కూడా హిట్  అనిపించుకుంది.  
* 1988 సంక్రాంతికి వచ్చిన బాలయ్య ’ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ సినిమా కూడా హిట్
* 1990 సంక్రాంతికి విడుదలైన బాలయ్య ‘ప్రాణానికి ప్రాణం’ సినిమా డిజాస్టర్.
* 1996 సంక్రాంతి బరిలో నిలిచిన ‘వంశానికొక్కడు’ మంచి విజయాన్ని అందుకుంది.
* 1997 సంక్రాంతికి విడుదలైన నటసింహం ‘పెద్దన్నయ్య’ బ్లాక్ బస్టర్.
* ఇక 1999 సంక్రాంతి అనగానే.. అందరికీ గుర్తొచ్చే అద్భుతం‘ సమరసింహారెడ్డి’. పాత రికార్డులన్నింటినీ తిరగరాసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నలిచింది.
* 2000 సంక్రాంతికి వచ్చిన ‘వంశోద్దారకుడు’ మరో డిజాస్టర్
* 2001 సంక్రాంతి మరోసారి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలయ్య. అదే ‘నరసింహనాయుడు’.
* 2002 సంక్రాంతి ‘సీమసింహం’. భారీ ఫ్లాప్
* 2004 సంక్రాంతి పోటీలో విజేతగా నిలిచాడు బాలయ్య. సినిమా ‘లక్ష్మీ నరసింహ’.
* 2008 సంక్రాంతికి ‘ఒక్క మగాడు’ సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు.
* 2011 సంక్రాంతికి బాలయ్య సినిమా ‘పరమవీరచక్ర’. ఆ సినిమా కూడా డిజాస్టర్
* 2016 సంక్రాంతికి మరో డిజాస్టర్ ‘డిక్టేటర్’
* 2017 సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గా భారీ విజయాన్ని అందుకున్నాడు.
* 2018లో సంక్రాంతికి ‘జై సింహ’గా మన ముందుకొచ్చాడు బాలయ్య.

అంటే... ‘జై సింహా’... బాలయ్య 18వ సంక్రాంతి సినిమా అనమాట. విడుదలైన  17 సినిమాల్లో పది విజయాలు అందుకున్నాడు. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘జై సింహ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది.

ఇక పవర్ స్టార్ సంక్రాంతి ముచ్చట గురించి చెప్పుకుందాం. నటునిగా బాలయ్య కంటే చాలా జూనియర్ అయిన పవర్ స్టార్.. ఇమేజ్ విషయంలో మాత్రం అందర్నీ దాటిపోయాడు. ఆయన ఫ్లాప్ సినిమా వంద కోట్లు వసూలు చేస్తోందంటే... పవర్ స్టార్ ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇమేజ్ ని బట్టి చూస్తే... ప్రస్తుతం నంబర్ వన్ హీరో ‘పవన్ కల్యాణ్’ మాత్రమే. అందులో సందేహమే లేదు. ఇక పవర్ స్టార్ సంక్రాంతి ముచ్చట గురించి చెప్పుకుంటే...

పవర్ స్టార్ తొలి సంక్రాంతి సినిమా ‘సుస్వాగతం’.  1998 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ హిట్. మ్యూజికల్ గా సన్సేషన్ క్రియేట్ చేసింది.ఇది పవన్ కల్యాణ్ మూడో సినిమా కావడం విశేషం.

ఇక పవర్ స్టార్ రెండో సంక్రాంతి సినిమా ‘బాలు’. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. మ్యూజికల్ గా మాత్రం హిట్. 2005లో ఈ సినిమా విడుదలైంది.

‘బాలు’ వచ్చిన పదేళ్ల తర్వాత.. అంటే 2015లో మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచాడు పవర్ స్టార్. ఆ సినిమానే ‘గోపాల గోపాల’.  వెంకటేశ్ తో కలిసి పవన్ చేసిన ఈ మల్టీస్టారర్ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో పవర్ స్టార్ మోడ్రన్ కృష్ణుడిగా నటించారు.

2018 సంక్రాంతి బరిలో ‘అజ్ఙాతవాసి’గా  వచ్చాడు పవర్ స్టార్. .

అంటే... సంక్రాంతి బాలయ్యకే కాదు... పవర్ స్టార్ కి కూడా బాగానే కలిసొచ్చింది. ఇప్పటివరకూ సంక్రాంతి పోటీలో మూడు సినిమాలు నిలిస్తే... మూడింటిలో రెండు హిట్స్..  ‘అజ్ఙాతవాసి’  డివైడ్ టాక్ తో నడుస్తోంది.

మరిచిపోయా... త్రివిక్రమ్ కెరీర్ లో తొలి సంక్రాంతి సినిమా ఇదేనండోయ్...


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.