భారీ రేటు పలికిన బాలయ్య కొత్త సినిమా హక్కులు
on Sep 16, 2020
మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. సాధారణ కథతో వచ్చిన 'జై సింహ'తో ఆయన సాలిడ్ కమర్షియల్ సక్సెస్ కొట్టారు. బాలయ్యకు దర్శకుడు బోయపాటి శ్రీను తోడైతే ఎలా ఉంటుందో 'సింహ', 'లెజెండ్' సినిమాలు చూపించాయి. సో... వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులు భారీ రేటు పలుకుతున్నాయి.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఒక ప్రముఖ ఓటీటీ భారీ రేటుకు రైట్ తీసుకున్నదని తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను సొంతం చేసుకునే విషయంలోనూ ఛానళ్ల మధ్య పోటీ నడుస్తోందని ఫిలింనగర్ టాక్.
'సింహా', 'లెజెండ్' భారీ కమర్షియల్ సక్సెస్ లు కొట్టడంతో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ఈ హ్యాట్రిక్ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయంలో రేటు ఎక్కువగానే చెబుతున్నారట. బాలయ్య బోయపాటి కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా చెప్పిన దానికి కొంత అటో ఇటో ఇవ్వడానికి టీవీ ఛానల్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది.
Also Read