బాహుబలిలో విలన్ కట్టప్పా..?
on Mar 23, 2017
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న బాహుబలి ద కన్‌క్లూజన్ విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు పెట్టి..వాటికి ఆన్సర్స్ కావాలంటే బాహుబలి కన్‌క్లూజన్ చూడాలంటూ మెలిక పెట్టాడు జక్కన్న..మిగిలిన వాటి సంగతి పక్కనబెడితే మెయిన్‌గా అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు" అనేది..దీనిపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరిదీ ఇదే డౌట్..
మరోవైపు ఈ సినిమాలో విలన్ అంటే ఎవరైనా చెప్పేది భల్లాలదేవుడు అనే..అయితే అసలు విలన్ భల్లాలదేవుడు కాదట..కట్టప్ప అంటోంది శివగామి. శివగామి ఎలా ఎదిగిందనే కథను "ది రైజ్ ఆఫ్ శివగామి" అనే పేరిట పుస్తకరూపంలో తీసుకువస్తున్నారు ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత. ఇందులో మెయిన్ విలన్ కట్టప్పేనట..మాహిష్మతి సామ్రాజ్యానికి అధినేత కావాలనే ఆశతో తన తమ్ముడితో కలిసి బాహుబలిని కడతేర్చేందుకు కుట్ర పన్ని అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడట. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో మాత్రమే విడుదలైన ఈ పుస్తకాన్ని త్వరలో తెలుగు సహా దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయనున్నారు. కాని బాహుబలిలో అసలు మెలిక తెలియాలంటే సినిమా చూడాల్సిందే.