అరవింద్ స్వామికి ఇంత పెద్ద కూతురు ఉందా!
on Jan 25, 2021
అందాల నటుడు అరవింద్ స్వామి రెండు దశాబ్దాల క్రితం తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించుకొని, తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మణిరత్నం సినిమాలు 'రోజా', 'బొంబాయి' ఆయనకు క్రేజ్ తెచ్చాయి. తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు గుడ్‌బై చెప్పి, తన వ్యాపారాలు చూసుకుంటూ వచ్చాడు. తిరిగి తన మెంటర్ మణిరత్నం సినిమా 'కడల్'తో రిఎంట్రీ ఇచ్చి, అప్పట్నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన విలన్ పాత్రలతోనూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా మోహన్ రాజా డైరెక్ట్ చేసిన 'తని ఒరువన్', దాని తెలుగు రీమేక్ 'ధృవ' సినిమాల్లో చేసిన స్టైలిష్ విలన్ రోల్‌తో ఆయన తన నటనలోని మరో యాంగిల్‌ను పరిచయం చేశాడు. మరోవైపు హీరోగానూ నటిస్తున్నాడు.
లేటెస్ట్‌గా ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆయన సైకిల్ తొక్కుతుంటే, సైకిల్‌పై ఆయన ముందు ఓ అమ్మాయి కూర్చొని పెద్దగా నవ్వులు చిందిస్తూ ఉంది. ఆయన ముఖంపై కూడా నవ్వు కనిపిస్తోంది. ఆమె అరవింద్ స్వామి కూతురే. దాంతో ఆయనకు ఇంత పెద్ద కూతురు ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ పిక్చర్‌ను అరవింద్ స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, "Bicycle thieves!" అని క్యాప్షన్ పెట్టాడు.
అరవింద్ స్వామి ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఎం.జి. రామచంద్రన్ పాత్రను పోషిస్తున్నాడు. టైటిల్ రోల్‌ను కంగనా రనౌత్ చేస్తున్న ఈ మూవీకి ఎ.ఎల్. విజయ్ దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
