ఫొటో టాక్: బేబీ బంప్‌తో... స్విమ్ సూట్లో!
on Sep 21, 2020
చక్కనమ్మ చిక్కినా అందమే అని ఓ సామెత. చిక్కడం కాదు... బేబీ బంప్‌తో ఉన్నప్పటికీ అందంగా ఉంటారని ఎవరైనా అనుష్కా శర్మను చూస్తే అనక మానరు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అయిన ఈ బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. బేబీ బంప్‌తో అప్పుడప్పుడూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లేటెస్టుగా బ్లాక్ స్విమ్ సూట్ వేసుకుని ఫూల్లో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. వరల్డ్ గ్రాటిట్యూడ్ డే సందర్భంగా ఈ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క గంటలో 15 లక్షలమంది ఫొటోను లైక్ చేశారు.