అమెజాన్లో మాస్టర్ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్
on Jan 20, 2021
ఈ సంక్రాంతికి విడుదలైన కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మాస్టర్.. టాక్ తో సంబంధం లేకుండా దాదాపుగా విడుదలైన అన్ని చోట్ల లాభాల బాట పట్టింది. తెలుగునాట అయితే తొలి రోజే 80% రికవరీ అయి వార్తల్లో నిలిచింది. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే డిజిటిల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందట.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్.. మాస్టర్ తాలూకు డిజిటల్ రైట్స్ ని పొందిందని, వేలంటైన్స్ డే వీకెండ్ స్పెషల్ గా ఫిబ్రవరి 12 నుంచి మాస్టర్ ని స్ట్రీమ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. సినిమా విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమ్ అయ్యే విధంగా.. మాస్టర్ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ మేరకే ఫిబ్రవరి 12న మాస్టర్ అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోందని సమాచారం.
త్వరలోనే మాస్టర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మాస్టర్ లో విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నాయికగా నటించగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించాడు.