కేరళలో అల్లు అర్జున్ యోధావు ప్రభంజనం..!
on May 28, 2016
తెలుగు రాష్ట్రాల్లో విజృంభించిన సరైనోడు ఇప్పుడు కేరళలో కూడా దాడి మొదలెట్టేశాడు. యోధావు అన్న పేరుతో నిన్న కేరళలో రిలీజైన సరైనోడు మూవీ, మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దాదాపు 80 కి పైగా స్క్రీన్లలో రిలీజై అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. మళయాళ రివ్యూలన్నీ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాయి. కేరళలో బన్నీ కున్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అల్లు అర్జున్ డ్యాన్సులన్నా, స్టైల్ అన్నా అక్కడి యూత్ లో అలాంటిలాంటి క్రేజ్ కాదు. గత ఏడాదికాలంలో మళయాళంలో డబ్బింగ్ సినిమాలు ఆడింది చాలా తక్కువ. యోధావు కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు అక్కడి సినీజనాలు. అయితే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి అక్కడ భారీ లాభాల దిశగా సాగిపోతోంది. కేరళలో రిలీజైన అల్లు అర్జున్ సినిమాల్లో యోధావు రికార్డ్స్ బద్ధలుగొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.