బన్నీ 'ఐకాన్' ఆగిందా?
on Oct 12, 2019
అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా ప్రెజెంట్ సెట్స్‌పై ఉంది. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తర్వాత రెండు సినిమాలు చెయ్యడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేం వేణు శ్రీరాం డైరెక్షన్లో అనౌన్స్ చేసిన 'ఐకాన్' కాగా, మరొకటి సుకుమార్ డైర్క్షన్లో చెయ్యాల్సిన సినిమా. 'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. దాని తర్వాత బన్నీ 'ఐకాన్' సినిమా చేస్తాడా? లేక సుకుమార్ సినిమా చేస్తాడా? అనేది తేలలేదు. ఇంతలోనే ఒక రూమర్ ఫిలింనగర్లో తెరపైకి వచ్చింది. 'ఐకాన్' మూవీ ఆగిపోయిందనేది ఆ రూమర్.
చేగువేరా బయోపిక్‌గా హాలీవుడ్లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు శ్రీరాం రాసుకున్నాడనేది సమాచారం. దాని ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో బన్నీ హ్యాపీగా లేడనీ, అందుకే ఆ ప్రాజెక్టును వద్దనుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది దిల్ రాజు ప్రాజెక్ట్ కాబట్టి అంత ఈజీగా ఆగిపోయే ప్రసక్తి ఉండదని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న దిల్ రాజు 'ఐకాన్' మోషన్ టీజర్ రిలీజ్ చేశాడు కూడా. 'కనబడుట లేదు' అనేది ట్యాగ్‌లైన్. డైరెక్టర్ వేణు శ్రీరాంతో స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దించే పని ఆయన చేపట్టాడనీ, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావచ్చనీ ఆ వర్గాలు అంటున్నాయి.
Also Read