అలా మొదలైందికి పదేళ్ళు
on Jan 21, 2021
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో అలా మొదలైంది ఒకటి. నందినీ రెడ్డి దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాతోనే టాలెంటెడ్ యాక్ట్రస్ నిత్యా మీనన్ నాయికగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా రెండు పాటలు కూడా పాడి అప్పట్లో వార్తల్లో నిలిచింది నిత్య. అలాగే ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అలా మొదలైందిని శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూర్చారు.
స్నేహా ఉల్లాల్, కృతి కర్బంద, ఆశిష్ విద్యార్థి, రోహిణి, ప్రగతి, తాగుబోతు రమేష్, చైతన్య కృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన అలా మొదలైంది.. తమిళంలో ఎన్నమో ఏదో, బెంగాలీలో ఓల్పో ఓల్పో ప్రేమర్ గొల్పో, కన్నడలో భలే జోడీ టైటిల్స్ తో రీమేక్ అయింది. 2011 జనవరి 21న విడుదలై సంచలన విజయం సాధించిన అలా మొదలైంది.. నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
