ఆమెతో డేటింగ్ చేస్తున్న అక్కినేని అఖిల్..!
on Jun 27, 2016
అక్కినేని నాగేశ్వర్రావు మనవడిగా, అక్కినేనీ నాగార్జున తనయుడిగా ఘనమైన నేపధ్యం కలిగిన "అఖిల్" కూడా వారి బాటలోనే కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిందనుకోండి, ఆ సినిమా విడుదలై ఆరేడు నెలలవుతున్నా ఇప్పటివరకూ తన తదుపరి సినిమా ఎంటనే విషయంలో క్లారిటీ లేని అఖిల్.. అప్పుడే ప్రేమలో "అ ఆ"లు దిద్దేశాడట. కుర్రోడు గత కొంతకాలంగా తన స్నేహితురాలితో డేటింగ్ చేస్తున్నాడట. ఆ అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రానివ్వడం లేదు. తనకు మాత్రమే కాక తన కుటుంబానికి ఆ అమ్మాయి తెలుసునంట. ఈ విషయాలను అఖిల్ స్వయంగా మీడియాకు తెలిపాడు. ప్రేమ విషయంలో అఖిల్ మెయింటైన్ చేస్తున్న క్లారిటీ.. తన నెక్స్ట్ సినిమాలోనూ చూపిస్తే అతగాడి కెరీర్ కూడా గాడినపడే అవకాశం ఉంది!