అప్పుడు `ధృవ`.. ఇప్పుడు `ఏజెంట్`..
on Apr 10, 2021
తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు దర్శకుడు సురేందర్ రెడ్డి. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ కెప్టెన్.. 16 ఏళ్ళ చిత్ర ప్రయాణంలో కేవలం తొమ్మిది సినిమాలకే
పరిమితమయ్యారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న `ఏజెంట్` తనకి పదో సినిమా కావడం విశేషం. అక్కినేని యంగ్ హీరో అఖిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ `ఏజెంట్`.. డిసెంబర్ 24న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. డిసెంబర్ 7 సురేందర్ రెడ్డి పుట్టినరోజు. గతంలో తన బర్త్ డే మంత్ లో వచ్చిన `ధృవ` (2016) సురేందర్ కి మంచి విజయాన్ని అందించింది. కట్ చేస్తే.. ఐదేళ్ళ
తరువాత `ఏజెంట్` రూపంలో ఇప్పుడదే బర్త్ డే మంత్ లో మరో సినిమా రానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. `ధృవ`లాగే `ఏజెంట్` కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
కాగా, `ఏజెంట్`లో అఖిల్ కి జంటగా సాక్షి వైద్య నటించనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చనున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో `ఏజెంట్` తెరకెక్కనుంది.
Also Read