అల్లరోడి `అహ నా పెళ్ళంట`కి పదేళ్లు
on Mar 2, 2021
`అల్లరి` నరేశ్ కెరీర్ లో పలు విజయవంతమైన వినోదాత్మక చిత్రాలు ఉన్నాయి. వాటిలో `అహ నా పెళ్ళంట` ఒకటి. వీరభద్రమ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతోనే రీతూ బర్మేచా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శ్రీహరి, అనిత, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, సత్యం రాజేశ్, వెన్నెల కిశోర్, వేణు మాధవ్, హంసా నందిని తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రఘు కుంచె స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి వెటరన్ మ్యూజిక్ కంపోజర్ కోటి నేపథ్య సంగీతమందించారు. రఘు కుంచె అందించిన పాటల్లో.. `నాలుగు స్థంబాలాట`లోని `చినుకులా రాలి` సాంగ్ రీమిక్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన `అహ నా పెళ్ళంట` .. 2011 మార్చి 2న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్.. పది వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Also Read