అబ్బాస్ కుమార్తె ఫొటోస్ వైరల్
on Jul 4, 2020
తమిళ డబ్బింగ్ సినిమా 'ప్రేమదేశం' (కాదల్ దేశమ్)తో రాత్రికి రాత్రే కుర్రకారులో యమ క్రేజ్ సంపాదించుకున్న నటుడు అబ్బాస్. ఆ క్రేజ్తోటే డైరెక్టర్ ముప్పలనేని శివ అతడిని 'ప్రియా ఓ ప్రియా మూవీ'తో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చూపులకు చాక్లెట్ బాయ్‌లా ఉండే అబ్బాస్.. ఆ తర్వాత రాజహంస, రాజా, అనగనగా ఒక అమ్మాయి, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై, శ్వేతనాగు వంటి సినిమాల్లో హీరోగానో లేకపోతే కీలక పాత్రధారిగానో నటించాడు. మరోవైపు పలు ఎండార్స్మెంట్స్ కూడా అతను చేశాడు.
1999లో డిజైనర్ ఎరుమ్ అలీని వివాహమాడిన అబ్బాస్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో స్థిరపడ్డాడు. ఆ దంపతులకు అయ్మాన్ అనే కొడుకు, ఎమిరా అనే కూతురు ఉన్నారు. ఇప్పుడు ఎమిరా ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చక్కని రూపలావణ్యాలతో మెరిసిపోతున్న ఎమిరాను చూసి నెటిజన్లు ఫ్లాటైపోతున్నారు.
Also Read