'అశ్వథ్దామ' బలం యాక్షనే!
on Jan 23, 2020
'కే జి ఎఫ్' చూసిన తర్వాత 'యాక్షన్ ఎపిసోడ్స్ ఏమున్నాయ్ రా బాబు' అనుకున్నారంతా. ఆ సినిమాలో హీరో యష్ ది కర్ణాటక అయినప్పటికీ... భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీలో డబ్బింగ్ సినిమాను విపరీతంగా చూశారంటే కారణం యాక్షన్ ఎపిసోడ్స్. ఆ చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్స్ అన్బరివు... నాగశౌర్య హీరోగా నటించిన తాజా సినిమా 'అశ్వథ్దామ'కు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అవి సినిమాకు హైలైట్ అవుతాయని, అవే బలంగా నిలుస్తాయని ఇన్ సైడ్ న్యూస్. సినిమాలో మూడు ఫైట్స్ ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయట.
'అశ్వథ్దామ'లో నాగ శౌర్య హీరోగా నటించడమే కాదు... ఆ సినిమాకు కథ కూడా అతడే రాశాడు. కంప్లీట్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కింది అట. రమణ దేశ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మెహరీన్ హీరోయిన్. మొదట అనుష్క 'నిశ్శబ్దం' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడడంతో నాగశౌర్యకు సోలో రిలీజ్ దొరికింది.