వర్మకు సాయపడిన రచయిత మృతి
on Jul 13, 2018
వర్మ కెరీర్ బెస్ట్‌లో ఒకటిగా నిలిచిన ‘అబ్ తక్ చప్పన్’ సినిమా గుర్తుంది కదా! ఈ సినిమాతో నానాపాటేకర్ కూడా మంచి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాకి రచయితగా పనిచేసిన రవిశంకర్ అలోక్ అనే యువ రచయిత ఈ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం అలోక్ తాను ముంబైలో ఉంటున్న ఓ ఏడంతస్తుల అపార్టుమెంటు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అలోక్ తన సోదరుడితో కలిసి ముంబైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా సినిమా రచయితగా పనిచేసిన అలోక్, ప్రస్తుతం తానే సొంతగా ఓ సినిమాని రూపొందించే ప్రయత్నాలలో ఉన్నాడు. కెరీర్లో ఒడిదుడుకులకే నిరుత్సాహపడ్డాడో, వ్యక్తిగతమైన ఇబ్బందులే ఎదుర్కొంటున్నాడో కారణం తెలియదు కానీ అలోక్ తన జీవితాన్ని అర్థంతరంగా చాలించేశాడు. తాను ఎందుకని చనిపోతున్నానో చెబుతూ ఒక క్లూ కూడా పోలీసులకు వదలకపోవడం మరో విచిత్రం.