నా కొడుకు ఎంట్రీ వరకూ కంటిన్యూ చేస్తా!
on Jul 24, 2016
కథానాయకుడిగా 30 ఏళ్ళ పూర్తి చేసుకొన్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం "బాబు బంగారం". మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో నిన్న విడుదలైంది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. "నటుడిగా మారుతో నాకు మరో 15 ఏళ్ల కెరీర్ ను జోడించాడు. నా కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చేవరకూ నటిస్తూనే ఉంటాను" అంటూ వెంకీ ఇచ్చిన స్టేట్ మెంట్ ని దగ్గుబాటి అభిమానులందరూ అమితోత్సాహంతో శిల్పకళావేదికపై ఆనందంతో చిందులేశారు. అలాగే.. తాను సాగించిన ఈ లాంగ్ ఇన్నింగ్స్ లో తనకు మంచి సినిమాలు ఇచ్చిన దర్శకులకు కృతజ్నతలు తెలిపాడు వెంకటేష్.
ఇకపోతే.. నిన్న విడుదలైన "బాబు బంగారం" పాటలకు, ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. గత కొంతకాలంగా సోలో హీరోగా సరైన హిట్ కొట్టలేక డీలా పడిన వెంకీకి "బాబు బంగారం" బంపర్ హిట్ ఇస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు!