ENGLISH | TELUGU  

విజయ్ దేవరకొండ అతిథిగా వస్తే అంతేనా?

on May 13, 2019

 

సినిమా ఫంక్ష‌న్‌ల‌కు విజయ్ దేవరకొండను అతిథిగా ఆహ్వానించాలంటే ఇండస్ట్రీ ప్రముఖులు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారా? ఏమో చెప్పలేం! స్టార్ హీరోల అభిమానులు మాత్రం అతణ్ణి అతిథిగా పిలవద్దని గోల చేసే అవకాశాలు బలంగా వున్నాయి. సినిమా ఫంక్ష‌న్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా సినిమా సంగతి అంతేనంటూ నెట్టింట్లో ఒక రేంజ్‌లో సెటైర్స్ పడుతున్నాయి. 

నాగచైతన్య 'సవ్యసాచి' ప్రీ రిలీజ్‌కి విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్‌గా ఆ సినిమా నిలిచింది. తరవాత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొమాకుల సోలో హీరోగా నటించిన 'నువ్వు తోపురా' ట్రైలర్ లాంచ్‌కి విజయ్ దేవరకొండ గెస్ట్‌గా వ‌చ్చాడు. పది నెలల క్రితం ట్రైలర్ విడుదలైతే... ఈ నెలలో సినిమా థియేటర్లలోకి వచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి నటిగా వచ్చిన నిహారికా కొణిదెల 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్‌కీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ్' వంటి హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి, సినిమాతో మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయాడు. లేటెస్టుగా ఈ జాబితాలో మహేష్ బాబు 'మహర్షి' కూడా చేరింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కి వెంకటేష్ ముఖ్య అతిథిగా వస్తే... విజయ్ దేవరకొండ అతిథిగా హాజరయ్యాడు. మహేష్ అభిమానినని, ఆయన్ని మహేష్ అని పిలుచుకునేవాడినని, ఇక్కడ సార్ అంటే ఇబ్బందిగా వుందని చెప్పుకొచ్చాడు. 'మహర్షి' వసూళ్లు, హిట్ అంటూ యూనిట్ చేస్తున్న హడావిడి పక్కన పెడితే... సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే.

విజయ్ దేవరకొండ అతిథిగా వస్తే రాత్రికి రాత్రి సినిమాలో కంటెంట్ ఏమీ మారదు. బాక్సాఫీస్ దగ్గర  సినిమా తలరాతను అతడు మార్చలేడు. కానీ, సెంటిమెంట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తెలుగు సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఫంక్ష‌న్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా వస్తే అది ప్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ బలంగా వెళితే? సినిమా అనేది టీమ్ వర్క్. హీరో, దర్శకుడు, నిర్మాత, ఇతరత్రా టెక్నీషియన్స్ కలసికట్టుగా కష్టపడతారు. అందరూ హిట్ సినిమా తీయాలని కష్టపడతారు. కానీ, ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ప్లాప్ అవుతాయి. ఆ ఫ్లాపులకు విజయ్ దేవరకొండ కారణం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఎంతమాత్రం తగదని చెప్పాలి.  

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.