వివాదం విజయం దేవరకొండ!
on Sep 20, 2018
మరక మంచిదే అన్నట్లు ...వివాదం కూడా కొన్ని సార్లు సినిమాలకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. అలా విజయ్ దేవరకొండ సినిమా అంటే వివాదంలో ఇరుక్కోవాల్సిందే. అవును...అవే ఆయన సినిమాలకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నాయి కూడా అంటున్నారు కొంత మంది. ఒక సారి అర్జున్ రెడ్డి సినిమా విషయానికొస్తే...ఆ సినిమా పోస్టర్ విషయంలో చాలా వివాదాలు చెలరేగాయి. ఆ వివాదమే ఈ సినిమాకు విపరీతమైన పబ్లిసటీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఇటీవల విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపిస్తోన్న `గీత గోవిందం` చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక దేవరకొండ లేటెస్ట్ చిత్రం నోటా చిత్రం కూడా ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది. ఒక సారి పూర్తి వివరాల్లోకి వెళితే...ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బేనర్ పై జ్జాన్ వేల్ రాజా నిర్మించిన చిత్రం నోటా. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చారు. అయితే ఇటీవల రిలీజైన ట్రైలర్ లో డైలాగ్ రైటర్ శశాంక్ వెన్నెలకంటి పేరు వేయలేదట. డైరక్టర్ పేరే వేసుకున్నారట. దీంతో ఇదే విషయంపై ఇటీవల శశాంక్ మీడియాతో మాట్లాడారు. `డైలాగ్స్ రాసినందకు రెమ్యూనిరేషన్ ఇవ్వకపోగా పేరు కూడా వేయలేదంటూ ..తనకు న్యాయం చేయాలంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. తనకు న్యాయం జరిగాకే సినిమాను విడుదలయ్యేలా చూడాలంటూ వారిని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం కూడా నోటా సినిమాకు మంచి పబ్లిసిటీ అవుతోంది.