యన్.టి.ఆర్... హీరోయిన్ పార్ట్ ఫినిష్!
on Dec 8, 2018
'యన్.టి.ఆర్'... నందమూరి తారక రామారావు బయోపిక్. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో హిందీ హీరోయిన్ విద్యా బాలన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. గురువారంతో బసవతారకం పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. హీరోయిన్ షూటింగ్ పార్ట్ ఫినిష్ అయ్యింది. తన చిత్రీకరణ పూర్తి కాగానే విద్యా బాలన్ ముంబై వెళ్లిపోయారు. ఈ సినిమాలో నటించడం తనకు ఓ మధురానుభూతి అని ఆమె పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాల కోసం చేసిన ప్రయాణాలను మినహాయిస్తే... గతంలో 'డర్టీ పిక్చర్', 'బాబీ జాసూస్' సినిమాల చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చాననీ, మూడోసారి 'యన్.టి.ఆర్' సినిమా చిత్రీకరణ కోసం వచ్చానని విద్యా బాలన్ తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర సంబంధించిన సన్నివేశాలు అన్నింటినీ హైదరాబాద్లో చిత్రీకరించారని ఆమె అన్నారు. 'యన్.టి.ఆర్'ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయకుడు' జనవరి 9న విడుదల కానుంది.