వెంకటేష్, సూర్య మల్టీస్టారర్..!!
on Aug 18, 2018
ఈ జనరేషన్లో తెలుగులో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేష్ అంటే అతిశయోక్తి కాదేమో.. మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. రామ్ తో 'మసాలా'.. పవన్ తో 'గోపాల గోపాల' లాంటి సినిమాలతో అలరించిన వెంకటేష్.. ప్రస్తుతం మరో రెండు మల్టీస్టారర్లు చేస్తున్న విషయం తెల్సిందే.. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ తో 'ఎఫ్ 2' కాగా, మరొకటి నాగ చైతన్యతో 'వెంకీ మామ'.. ప్రస్తుతం ఈ రెండు మల్టీస్టారర్లతో బిజీగా ఉన్న వెంకటేష్, ముచ్చటగా మూడో మల్టీస్టారర్ కి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.. 'నేను లోకల్' ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు.. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు తమిళ్ హీరో సూర్య కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.. ఇదే నిజమైతే ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్యకు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా అవుతుంది.