మహేష్ చిత్రంలో బ్లాక్ రోజ్ బ్యూటీ?
on Jan 25, 2021
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్.. నేటి నుంచి దుబాయ్ లో మొదలైంది.
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు - తమన్ కాంబినేషన్ లో వచ్చిన దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు చిత్రాల తరహాలోనే సర్కారు వారి పాటలోనూ ఓ ప్రత్యేక గీతానికి స్థానముందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ ఐటమ్ నంబర్ లో బ్లాక్ రోజ్ తో తెలుగు తెరకు నాయికగా పరిచయమవుతున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చిందులేయబోతోందట. త్వరలోనే సర్కారు వారి పాటలో ఊర్వశి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఈ ఏడాది ద్వితీయార్థంలో సర్కారు వారి పాట థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
