'సాహో' హీరోయిన్‌పై ప్రభాస్ ఫాన్స్ గుస్సా
on Sep 30, 2019
'సాహో'లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చెప్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఆమెపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వాళ్ల కోపానికి ఓ కారణం రీసెంట్ గా శ్రద్ధా కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లిప్. ప్రజెంట్ అది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. 'సాహో' ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే... 'ప్రేక్షకులు నాతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు' అని శ్రద్ధా కపూర్ ఆన్సర్ ఇచ్చింది. 'సాహో' గురించి మరో ప్రశ్న అడిగితే ప్రేక్షకులకు 'లవ్యూ' అని చెప్పింది. తర్వాత మరో ప్రశ్న వేస్తే... ప్రేక్షకులను 'చిచ్చోరే' చూశారా? అని అడిగింది. 'సాహో'కి సంబంధించిన ప్రతి ప్రశ్ననూ అవాయిడ్ చేస్తూ వచ్చింది.
శ్రద్ధా కపూర్ బిహేవియర్ ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది. సగటు సినిమా ప్రేక్షకులకూ ఆశ్చర్యం కలిగించింది. సినిమా ఇండస్ట్రీలో హిట్టూ ఫ్లాపులు కామన్. ప్లాప్ సినిమా గురించి సెలబ్రిటీలను ప్రశ్నిస్తే ఎక్కడో తప్పు జరిగిందనో, హిట్ అవుతుందని చేశామనో చెబుతారు. శ్రద్ధా కపూర్ ఓవర్ యాక్టింగ్ చేస్తూ, 'సాహో' ప్రశ్నలు అవాయిడ్ చేయడంతో ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చింది. దానికి తోడు అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో 'సాహో' సినిమా చూడలేదని చెప్పింది. ఫ్యామిలీతో కలిసి 'చిచ్చోరే' చూసింది. తెలుగు అంటే అంత తక్కువ చూపా? అని శ్రద్ధా కపూర్ పై కొందరు మండిపడుతున్నారు.
Also Read