ప్రభాస్ లుక్ మారుతుందట!
on Sep 10, 2019
'బాహుబలి'లో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి/శివుడు... రెండు పాత్రల్లో కనిపించారు. చారిత్రాత్మక చిత్రం కనుక రాచరికం ఉట్టిపడే దుస్తుల్లో ఎక్కువ కనిపించారు. స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'లో జీన్సులు, టీ షర్టులు... సూటు బూటుల్లో కనిపించాడు. డ్రస్సింగ్ వరకూ బావుందన్నారు ఫ్యాన్స్. కానీ, హెయిర్ స్టయిల్ విషయంలో కొందరు పెదవి విరిచారు. బాలేదన్నారు. దాంతో 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ప్రేమకథా చిత్రంలో డ్రస్సింగ్, హెయిర్ స్ట్రయిల్ పరంగా కొత్తదనం చూపించాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ. యూరప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అప్పటి నేపథ్యానికి తగ్గట్టు స్టయిలిష్ లుక్ కోసం ప్రభాస్ మేకోవర్ అవుతున్నాడట. 'సాహో' విడుదలకు ముందు ఈ సినిమా సీన్లు కొన్ని తీశారు. అయితే... మేజర్ షూటింగ్ పార్ట్ మొదలు కాలేదు. అవి మొదలుపెట్టే లోపు ప్రభాస్ మేకోవర్ కావాలి. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నారట.