బ్యాడ్ టాక్‌లోనూ 'సాహో' రికార్డ్ ఓపెనింగ్స్!
on Aug 31, 2019
ఎంత నెగటివ్ టాక్ నడుస్తున్నా 'సాహో'తో ప్రభాస్ తన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి మరోసారి రుచి చూపించాడు. అన్ని వెర్షన్లు కలిపి తొలిరోజు ఒక్క ఇండియాలోనే 'సాహో' రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని పేరుపొందిన సినీ విశ్లేషకుడు రమేశ్ పిళ్లై తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. "మొదటి రోజు ఇండియాలో అన్ని వెర్షన్లు కలిపి 'సాహో' రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇలాంటి థండరింగ్ ఓపెనింగ్ రావడానికి ప్రభాస్‌కున్న గొప్ప ఫ్యాన్ బేస్, ప్రి-రిలీజ్ హైప్, అడ్వాన్స్ బుకింగ్ కారణం. హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 24.40 కోట్ల నెట్ సాధించింది" అని ఆయన ట్వీట్ చేశారు.
ఇక 'సాహో' అన్బేరబుల్ సినిమా.. అంటూ దారుణంగా రివ్యూ చేసిన ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌కు 'సాహో' కలెక్షన్లు మైండ్ బ్లాక్ చేసుండాలి. ఆయన కూడా 'సాహో' హిందీ వెర్షన్ రూ. 24.40 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. "తొలిరోజు 'సాహో'కు సూపర్బ్ కలెక్షన్లు. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్‌కు వచ్చిన సూపర్‌స్టార్‌డం + ఈ బిగ్ సినిమా చుట్టూ వచ్చిన హైప్ + ఎక్సలెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల ఫెంటాస్టిక్ నంబర్స్ వచ్చాయి. సాలిడ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో రెండో రోజు, మూడో రోజు వసూళ్లు కీలకం. శుక్రవారం ఇండియాలో 'సాహో' హిందీ వెర్షన్ రూ. 24.40 కోట్ల నెట్ సాధించింది" అని ఆయన ట్వీట్ చేశారు.
గమనించాల్సిన విషయమేమంటే, 2019లో ఇప్పటివరకూ బాలీవుడ్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 'సాహో' మూడో ప్లేస్‌లో నిలవడం. 'సాహో' కంటే రూ. 42.30 కోట్లతో సల్మాన్ ఖాన్ మూవీ 'భారత్', రూ. 29.16 కోట్లతో అక్షయ్ కుమార్ మూవీ 'మిషన్ మంగళ్' మాత్రమే ముందున్నాయి. వరుణ్ ధావన్ 'కళంక్', అక్షయ్ 'కేసరి' సినిమాలు 'సాహో' తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ ఏడాది హృతిక్ రోషన్ 'సూపర్ 30', షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్', అజయ్ దేవ్‌గణ్ 'దే దే ప్యార్ దే', 'టోటల్ ధమాల్', టైగర్ ష్రాఫ్ 'స్టూడెంట్ ఆఫ్ ది యియర్ 2', అమితాబ్ బచ్చన్ 'బద్లా', రణ్వీర్ సింగ్ 'గల్లీ బాయ్', విక్కీ కౌశల్ 'ఉరి - ద సర్జికల్ స్ట్రైక్' సినిమాలు వచ్చాయి. వాటన్నింటి కంటే 'సాహో'కు ఓపెనింగ్స్ ఎక్కువ రావడమంటే, ఇమేజ్ పరంగా ఆ హీరోలందరి కంటే ప్రభాస్ ముందున్నాడనే అర్థం. ఒకవేళ తర్వాతి రోజుల్లో 'సాహో' వసూళ్లు తగ్గినా, క్రేజ్ విషయంలో అనేకమంది బాలీవుడ్ టాప్ స్టార్స్‌ని ప్రభాస్ మించిపోవడం కచ్చితంగా టాలీవుడ్‌కు గర్వ కారణమే. ఒక్క టాలీవుడ్ ఏమిటి.. మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే గర్వ కారణం. ప్రభాస్‌కు సంబంధించి ఇంకో విశేషం కూడా ఉంది. భారత్‌లో తొలిరోజు రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసిన రెండు సినిమాల హీరోగా మరో రికార్డును సైతం అతను సొంతం చేసుకున్నాడు. ఇదివరకు 'బాహుబలి 2' కూడా అన్ని భాషల్లో కలిపి రూ. 100 కోట్ల పైగా గ్రాస్ సాధించింది.
విపరీతమైన బ్యాడ్ టాక్‌లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న 'సాహో' తొలివారం ఎన్ని రికార్డుల్ని సొంతం చేసుకుంటాడో.. జస్ట్ వెయిట్ అండ్ సీ..