బాలయ్యతో బోయపాటి సినిమా ఎప్పుడంటే?
on Aug 31, 2019
నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో 'సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పెడుతున్నట్టు సమాచారం. అంతేకాదు బోయపాటి దర్శకత్వంలో రుపొందిన ` జయ జానకి నాయక` చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు బాలయ్య , బోయపాటి సినిమా కూడా నిర్మించనున్నారని టాలీవుడ్ టాక్. అలాగే ఈ ఏడాది నవంబర్ లో చిత్రాన్ని ప్రారంభించి వచ్ఛే సంవత్సరం వేసవిలో విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుతం బాలకృష్ణ , కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రూలర్` ( ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 21న విడుదల కానుందని సమాచారం.