`మహర్షి` లో మహేష్ కొడుకు!!
on Mar 11, 2019
మహేష్ బాబు 25 వ సినిమాగా `మహర్షి` వస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడి పల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 15తో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...ఈ సినిమాలో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ కృష్ణ నటించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో నటించలేదు. మరి మహర్షిలో నటిస్తున్నాడన్న వార్త ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. మూడు విభిన్నమైన గెటప్స్ లో ఉన్న క్యారక్టర్ లో మహేష్ బాబు కనిపించనున్నాడట. దిల్ రాజు, అశ్వనిదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ 25 వ సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లరి నరేష్ ఒక కీలకపాత్రలో నటించాడు. ఒకవైపు శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తె లుస్తోంది.