బన్ని సినిమాకు హీరోయిన్ ఫిక్స్!!
on Jan 3, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించుకోనుంది. అయితే ఈ సినిమాకు హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ` చిత్రంలో హీరోయిన్ గా నటించిన కియరా అద్వానీని బన్నీకి జోడిగా ఫైనల్ చేశారట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎవరైనా హీరోయిన్ మెగా కాంపౌండ్ లో సంబంధించిన హీరోతో నటిస్తే ఆ తర్వాత వరుసగా ఆ కాంపౌండులోని హీరోలతో నటించే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం `వినయ విధేయ రామ` చిత్ర కోసం రామ్ చరణ్ తో జత కట్టింది కియారా. తాజాగా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇదే క్రమంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో జత కట్టే అవకాశం దక్కుతుందేమో వేచి చూద్దాం.