'సాహో'... శాటిలైట్ 80 కోట్లా?
on Oct 31, 2018
'బాహుబలి' తరవాత తెలుగులో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'సాహో' ఒకటి. అందులోనూ 'బాహుబలి' తరవాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. భారీ బడ్జెట్, స్టార్కాస్ట్ వంటి విషయాల్లో ఎక్కడా తగ్గడం లేదు. అయితే... ప్రభాస్ పుట్టినరోజు వరకూ ఈ సినిమాపై సందేహాలు వుండేవి. ఒకే ఒక్క సినిమా అనుభవం కల సుజీత్ సినిమాను ఎలా తీస్తాడోనని. ప్రభాస్ పుట్టినరోజుకు విడుదల చేసిన 'సాహో' మేకింగ్ వీడియోతో అందరికీ సినిమాపై ఒక క్లారిటీ వచ్చింది. పిక్చర్ క్లియర్‌గా కనిపించింది. సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ టైమ్‌లోనే శాటిలైట్ డీల్ కంప్లీట్ చేయాలని యూవీ క్రియేషన్స్ పావులు కదుపుతోంది.
'సాహో' హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ రూ.80 కోట్లు చెప్పార్ట! తెలుగు ఏ సినిమాకీ ఇప్పటివరకూ ఇంత శాటిలైట్ రేటు రాలేదు. 'బాహుబలి 2' హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా రూ. 77 కోట్లే. అందులో 51 హిందీకి, 26 తెలుగుకి అనుకున్నారు. ఎంత 'బాహుబలి 2' తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా అయినా 'బాహుబలి 2' శైటిలైట్ రైట్స్ కంటే ఎక్కువ ఇస్తారా? అనేది డౌటే. అటూ ఇటూగా ఎంత కాదనుకున్నా.. రూ.70 కోట్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హిందీ హీరోయిన్ శ్రద్ధా కపూర్, యాక్టర్స్ నీల్ నితిన్ ముఖేష్, చుల్బుల్ పాండే, మందిరా బేడీ, ఎలివీన్ శర్మ తదితరులు వుండటం 'సాహో'కి ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.