ప్రభాస్ అక్కడ... పూజా ఇక్కడ!
on Oct 13, 2018
తెలుగు హీరోయిన్లలో ఫుల్ బిజీగా వున్నది ఎవరంటే పూజా హెగ్డే పేరు ముందు చెప్పాలి. గురువారం విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో అరవింద పాత్రలో సందడి చేసిన పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు పెద్ద సినిమాలు వున్నాయి. అందులో మహేష్ బాబు 'మహర్షి' ఒకటి. ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. హిందీలో 'హౌస్ ఫుల్ 4' మరొకటి. ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పూజా హెగ్డే నటిస్తుంది. అందుకని, నెలలో నాలుగైదు రోజులు ఒక సినిమాకు, నాలుగైదు రోజులు మరో సినిమాకు కేటాయిస్తుంది. ప్రభాస్ సినిమా కోసం ఈ నెల 10న ఇటలీ వెళ్లిన పూజా హెగ్డే అప్పుడే తిరిగి వచ్చేసింది. ఐదంటే ఐదే రోజులు షూటింగ్ చేసింది. హిందీ సినిమా షూటింగ్ వుండటంతో వచ్చేసిందని సమాచారం. ప్రభాస్ మాత్రం అక్కడే ఇటలీలో వున్నారు. ఆయనపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే... ప్రభాస్ 'సాహో' షూటింగ్ స్టార్ట్ చేస్తారు.