మా వివాదం.. షాకిస్తున్న మహేష్ నిర్ణయం.!!
on Sep 6, 2018
కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) లో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. 'మా' సొంత బిల్డింగ్ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంది.. దానిలో భాగంగా స్టార్ హీరోల చేత యూఎస్‌లో ఈవెంట్స్ నిర్వహిస్తోంది.. ఇప్పటికే చిరంజీవి అతిధిగా యూఎస్‌లో ఓ ఈవెంట్ నిర్వహించింది.. దీనివల్ల 'మా' కు కోటిరూపాయలు వచ్చాయి.. అయితే అసలు రచ్చ ఇక్కడే మొదలైంది.. మా అధ్యక్షుడు శివాజీ రాజా ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులు దుర్వినియోగం చేసారని ఆరోపిస్తూ ఓ ఆంగ్ల పత్రిక వార్త ప్రచురించింది.. 'మా’ కార్యదర్శి నరేష్ కూడా ఆ కథనానికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు.. ఇంకేముంది 'మా' రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిమీద ఒకరు సవాళ్లు, ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు..
ఈ రచ్చంతా తన ఈవెంట్ మూలంగా అయిందంటూ చిరంజీవి పేరు ప్రస్తావనకు రావడంతో చిరంజీవి కూడా 'మా' తీరుపై మండిపడినట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పుడు 'మా' కు మహేష్ బాబు రూపంలో మరో షాక్ తగలనుంది.. 'మా' అక్టోబర్‌లో మహేష్ తో ఈవెంట్ ప్లాన్ చేసింది.. మహేష్‌కు యూఎస్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.. మహేష్ ఈ ఈవెంట్ చేస్తే ‘మా’కు భారీ మొత్తంలో నిధులు వస్తాయి.. కానీ ‘మా’ వివాదం చెలరేగిన నేపథ్యంలో మహేష్ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వినవస్తున్నాయి.. ఇదే నిజమైతే ఇది 'మా' కు పెద్ద షాక్ అనే చెప్పాలి.