నాగచైతన్యకు మొదలైన సమంత పోరు...!
on Sep 5, 2018
అవునండి ఇది నిజం.. అసలు విషయం ఏమిటంటే.... నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారు దర్శకత నిర్మాతలు. కాగా ఇదే రోజు ‘యుటర్న్’అనే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అప్పటి టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్... ఇప్పుడు మాత్రం నాగచైతన్య సతీమణి,హీరోయిన్ సమంత ప్రధాన పాత్రగా తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం. అంతే కాకుండా మహిళా ప్రాధాన్యం కలిగిన సినిమా కావడం మరో విశేషం. సో.. సెప్టెంబరు 13న భర్త నాగచైతన్యతో భార్య సమంత పోరుకు సిద్ధమయ్యారన్నమాట. అసలే సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతన్యకు 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' వంటి చిత్రాల వరుస విజయాలతో మంచి జోస్మీద వున్న సమంత గట్టి పోటీఇస్తుందనే అంటున్నారు సినీవర్గాలు. సో...పోరులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఈ నెల 13 వరకు అగాల్సిందే మరి.