పిచ్చెకిస్తున్న సమంత స్పెషల్ సాంగ్..!
on Sep 4, 2018
కన్నడలో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ‘యు టర్న్’. ఇప్పుడు ఆ ‘యు టర్న్’ రీమేక్‌లో సమంత నటించనున్నారు. మాతృకను దర్శకత్వం వహించిన పవన్‌కుమార్ తాజాగా తెలుగు, తమిళంలో రూపొందించనున్నారు. ఈ రెండు భాషల్లోనూ అదే టైటిల్‌నే పెట్టారు. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ పతాకంపై మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత పరిశోధన జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఇటీవల రంగస్థలం, అభిమన్యుడు, మహానటి వంటి వరుస విజయాలను అందుకున్న సమంత ఇందులో తన నట విశ్వరూపం చూపనుందని చిత్రబృందం తెలిపింది. తన వైవిధ్యమైన పాత్రోచితంగా ఆమె లుక్స్, అభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వారు చెప్పారు. ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు.‘కర్మ థీమ్’ అంటూ వచ్చిన ఈ సాంగ్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ఈ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెంచడంలో సమంత విజయం సాధించింది. ఇప్పుడు ఈసినిమా విడుదల కోసం పేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.