దేవదాస్ టీజర్ రివ్యూ
on Aug 24, 2018
నాగార్జున, నానిల మల్టీస్టారర్ అనగానే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.. ఆ మల్టీస్టారర్ కి దేవదాస్ అనే టైటిల్ అనగానే ఆ ఆసక్తి రెట్టింపైంది.. దేవదాస్ సినిమాకు 'భలే మంచి రోజు', 'శమంతకమణి' సినిమాలతో అలరించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ విడులైంది.. ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.. నాగార్జున, నాని పక్క పక్కన కూర్చోని ఉంటారు.. నాగార్జున మందు పోస్తుండగా నాని నాక్కూడా కావాలి అన్నట్టుగా గ్లాస్ ఇస్తాడు.. నాగార్జున మందుపోసి ఐస్ క్యూబ్స్ కోసం అటువైపు తిరిగే సరికి, గ్లాస్ లో ఉన్న మందు నాని తాగుతాడు.. రెండోసారి కూడా నాని అలాగే తాగుతుండగా నాగార్జున చూస్తాడు.. అప్పుడు ఇద్దరి ఎక్స్ ప్రెషన్స్ భలే ఫన్నీగా ఉన్నాయి.. నాగార్జున, నానిని చూస్తూ దాస్ ఏంటి సంగతి? అని అడుగుతాడు.. ఇలా ఫన్నీగా సాగుతూ ఆకట్టుకున్న ఈ టీజర్ కు మెయిన్ పిల్లర్ మ్యూజిక్ అని చెప్పాలి.. మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఫన్నీ మూడ్ లోకి అలా తీసుకెళ్ళిపోయింది.. టీజర్ తో నవ్వించిన నాగార్జున, నాని సినిమాతో ఇంకెంత నవ్విస్తారో చూడాలి మరి.