అల్లు అర్జున్ ఎక్కడ..?
on Jul 27, 2018
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి నాలుగైదు విదులయ్యేవి.. తరువాత ఏడాదికి రెండు మూడు అయ్యాయి.. ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఏడాదికి ఒకటి విదులైతే చాలు అన్నట్టుంది.. అయితే టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలతో పోల్చుకుంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు ఫాస్ట్ గానే విడుదలవుతాయి.. ఇద్దరు ఇంచు మించు ప్రతి ఏడాది ఒకటి రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటారు.. కానీ ఈ సారి అల్లు అర్జున్ స్పీడ్ కాస్త తగ్గించాడు.. ఎప్పుడూ చేతిలో సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్.. 'నా పేరు సూర్య' ఫలితంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. ఎందరో దర్శకులు అల్లు అర్జున్ ని కలిసి ఎన్నో కథలు వినిపించారు.
ఆ డైరెక్టర్ తోనే నెక్స్ట్ సినిమా, ఈ డైరెక్టర్ తోనే నెక్స్ట్ సినిమా అంటూ వార్తలు కూడా వినిపించాయి.. కానీ అల్లు అర్జున్ ఇంకా ఏ కథని ఫైనల్ చేయలేదు.. దీంతో అభిమానులు మా హీరో ఎక్కడ? మా హీరో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.. అయితే అల్లు అర్జున్ అభిమానుల కోసం ఓ ట్వీట్ చేసాడు.. 'నామీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు.. దయచేసి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి.. ఈ సారి మీకు మంచి సినిమా ఇస్తాను.. దానికి కొంచెం సమయం పడుతుంది..నన్ను అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. మొత్తానికి అల్లు అర్జున్ లేట్ అయినా పర్లేదు మంచి సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యాడు.. చూద్దాం మరి అల్లు అర్జున్ ఈసారి అదిరిపోయే హిట్ ఇస్తాడేమో.