బాలయ్య అడిగితే `నో` చెప్పిన నాగ్
on Jun 27, 2018
బాలకృష్ణ - నాగార్జున మధ్య ఉన్న సంబంధాలు అంతంతమాత్రమే అని ఫిల్మ్ నగర్ జనాలు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు. ఓ అవార్డు ఫంక్షన్లో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఓ టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఓ సందర్భంగా ఈ విషయమై నాగార్జున కూడా స్పందించారు. `బాలయ్యతో గొడవలు లేవు` అని ఆయన గట్టిగా చెప్పారు కూడా. కానీ.. ఈ గాసిప్పులు ఆగడం లేదు. కాకపోతే.. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చున ఓ విషయం జరిగింది. `ఎన్టీఆర్` బయోపిక్‌తో బాలయ్య బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో స్టార్లని తీసుకొచ్చి.. కొత్త కళ తీసుకురావాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఏఎన్నార్ పాత్ర కోసం బాలయ్య నాగార్జునని సంప్రదించారని సమాచారం. కానీ నాగ్ మాత్రం సున్నితంగా `నో` చెప్పారని టాక్. నిజంగా బాలయ్యతో నాగ్‌కి ఎలాంటి గొడవా లేకపోతే.. ఈ పాత్రకు ఎందుకు `నో` చెబుతారన్నది టాలీవుడ్ జనాల ప్రశ్న. నాగ్ నో చెప్పడం వల్లే... ఆ పాత్ర నాగచైతన్య దగ్గరకు వెళ్లిందని, ఇప్పుడు నాగచైతన్య కూడా ఏఎఎన్నార్ పాత్ర చేయడానికి సిద్ధంగా లేడని, చైతూ స్థానంలో సుమంత్‌ని ఎంపిక చేసుకోవడం ఖాయమైందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ నాగ్ ఈ పాత్రకు ఓకే చెప్పి ఉంటే.. అక్కినేని - నందమూరి మధ్య వచ్చిన విబేధాలన్నీ తొలగిపోదును. ఆ ఛాన్స్ మిస్సయ్యింది.