నందమూరి హీరోకి తండ్రిగా నాగబాబు
on Jun 23, 2018
ఎన్టీఆర్.. టెంపర్ నుండి రూట్ మార్చాడు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటూ వరస విజయాలతో దూసుకెళ్తున్నాడు.. మరో వైపు ఇతర నటులతో స్నేహ పూర్వకంగా ఉంటూ అందరివాడు అనిపించుకుంటున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు నటించబోతున్నట్టు తెలుస్తుంది.. నాగబాబు అంతకముందు ఎన్టీఆర్ బాద్షా సినిమాలో కూడా నటించారు.. అయితే అరవింద సమేత సినిమాలో తండ్రిపాత్ర కావడంతో.. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు తెరమీద ఎలా కనువిందు చేస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే విడువులైన అరవింద సమేత ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా విడుదల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న్నారు.