చిరు అల్లుడికోసం బాలయ్య వస్తున్నాడు
on Jun 23, 2018
మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న విజేత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 24 న జరగనుంది.. ఈ ఫంక్షన్ కి చిరు వస్తాడన్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఫంక్షన్ లో అదిరిపోయే సర్ ప్రైజ్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.. ఈ ఫంక్షన్ కి నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తుంది.. ఈ వార్త నిజమైతే విజేత సాక్షిగా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్టేజి మీద చూస్తాం అనమాట. విజేత టీజర్ చూస్తుంటే, ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తు చేసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సబ్జెక్టు కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. "మనసుకు నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు. లైఫ్ లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి." మురళి శర్మ చెప్పిన ఈ డైలాగ్ అందరిని ఆలోచింపచేస్తోంది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటించింది.