ఫ్లాపిచ్చినా కూడా రాజమౌళితో సమానంగా తీసుకుంటున్నాడు
on Mar 2, 2018
సరైనోడు సూపర్ హిట్ తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన బోయపాటి శ్రీను, అందరినీ ఆశ్చర్యపరుస్తూ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక కోసం జత కట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, బోయపాటికి స్టార్స్ ఎవరు ఇప్పట్లో చాన్స్ ఇవ్వరు అనుకున్నారు. కానీ, రామ్ చరణ్ ని తన కథతో మెప్పించి సినిమా పట్టాలమీదికి తీసుకెళ్లాడు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీకి బోయపాటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అక్షరాలా 15 కోట్లు... ఇంతకు ముందు వరకు 10 కోట్లు తీసుకున్న బోయపాటి ఏకంగా 5 కోట్లు అమాంతంగా పెంచేసాడట. డైరెక్టర్ క్యాలిబర్ గురించి తెలుసు కాబట్టి... అందులోను చెర్రీ స్టోరీ ఒకే చేసాడు కాబట్టి అడిగినంత ఇవ్వడానికి దానయ్య ఒప్పుకున్నాడట. వరుస హిట్లు కొట్టిన రాజమౌళి కి ఒక సినిమాకు అందే మొత్తం, ప్లాప్ తీసినా కూడా బోయపాటి అందుకుంటున్నాడు. దట్ ఈజ్ బోయపాటి!