ఆ సినిమాతో పోలిస్తే... ‘పోకిరి’ కూడా ఫ్లాపేనట!
on Jan 22, 2018
‘నా జీవితంలో మరిచిపోలేని రోజు ఏదైనా ఉంటే ఇదే. ఎందుకంటే... మా బాస్ ఇన్నాళ్లకు నన్ను దర్శకునిగా గుర్తించాడు. కారణం.. నా ‘మెహబూబా’ చిత్రం ఆయనకు చూపించాను. ఆ సినిమా చూసి నన్నెంతో మెచ్చుకున్నాడు మా బాస్’ అంటూ మురిసిపోతున్నాడు పూరీ జగన్నాథ్. ఆయన కొడుకు ఆకాశ్ హీరోగా పూరీ రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని పూరీ... తన గురువైన రామ్ గోపాల్ వర్మకు ఈ సినిమాను చూపించాడు. సినిమా చూసి వర్మ... పూరీని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాదు... ‘ఓ సినిమా పరంగా ‘మెహబూబా’తో ‘పోకిరి’ని పోల్చి చూస్తే... ‘పోకిరి’ ఫ్లాప్. అంత గొప్పగా ఉంది ‘మెహబూబా’ ’ అని పూరీకి కితాబిచ్చశాడు వర్మ.
దీంతో... పూరీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పూరీ దరశకత్వంలో వస్తున్న పూర్తస్థాయి ప్రేమకథ ఇది. ఇప్పటివరకూ పూరీ కొన్ని ప్రేమకథలు తీసినా... అవన్నీ.. యాక్షన్ తో కూడుకున్నవే. కానీ.. ‘మెహబూబా’.. పరిపూర్ణమైన ప్రేమకథ అని తెలుస్తోంది. చూద్దాం.. పూరీ లోని కొత్త కోణం ఎలా ఉంటుందో!