బన్నీకి ఇది ఎలా సాధ్యమైందబ్బా..!!
on Jan 18, 2018
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ క్లోజ్ అవ్వడంతో.. తర్వాత సమ్మర్‌కి రాబోతున్న పెద్ద సినిమాల కోసం ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. వాటికి సంబంధించిన వార్తల కోసం ఆడియన్స్ బ్రౌజ్ చేస్తున్నారు. వాటిలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న నా పేరు సూర్య ఒకటి. సక్సెస్ఫుల్ రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా మెగాఫోన్ పట్టుకోవడంతో పాటు రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్‌తో నా పేరు సూర్యపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేవలం 24 గంటల్లోనే కోటికిపైగా వ్యూస్ దక్కించుకుని బన్నీ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు లేటేస్ట్‌గా మరో కొత్త మార్క్‌ను టచ్ చేశాడు అర్జున్.
ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 24.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇది బన్నీ కెరీర్లోనే హయ్యెస్ట్ రేట్. నా పేరు సూర్య తెలుగు శాటిలైట్ హక్కులను 15 కోట్లకు జీ-తెలుగు సొంతం చేసుకుందట. ఇక ఇతర భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ మరో 9 కోట్లకు వెళ్లాయట. దీంతో విడుదలకు నాలుగు నెలలు ముందుగానే సగం సినిమా బడ్జెట్ సంపాదించిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎప్పుడూ కోపంతో ఊగిపోయే ఓ సైనికుడి కథ ఆధారంగా రూపొందించిన నా పేరు సూర్యలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుల్ నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read